12 గంటలు.. నరకయాతన
ఇంటర్ సిటీ రైలు నుంచి పడిపోయిన యువకుడు
చిన్నశంకరంపేట: ఇంటర్సిటీ రైలు నుంచి సోమవారం రాత్రి పడిపోయిన యువకుడు వైద్యం అందక 12 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి-వడియారం రైల్వేస్టేషన్ల మధ్య అటవీ ప్రాంతంలో జరిగింది. మల్కాజిగిరికి చెందిన పాటి శివకుమార్ బ్యాంకు పనిపై సోమవారం ఉదయం నిజామాబాద్ వెళ్లాడు. బ్యాంకులో పని కాకపోవడంతో సోమవారం సాయంత్రం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మల్కాజిగిరికి బయలుదేరాడు.
రాత్రి మిర్జాపల్లి-వడియారం రైల్వేస్టేషన్ ల మధ్య కామారం రైల్వేగేట్ దాటిన...
more... తర్వాత రైల్లోంచి కిందపడిపోయాడు. కాగా, తనను ఎవరో తోసివేశారని యువకుడు చెబుతున్నాడు. రక్షించాలని అర్థించినా ఎవరూ పట్టించుకోలేదని ఆపై స్పృహ కోల్పోయానని తెలిపాడు. తర్వాత రోజు ఉదయం నీళ్ల కోసం అరుస్తుండగా అటుగా వెళ్తున్న రైల్వే కీమ్యాన్ గమనించాడు. రైల్వేట్రాక్ పక్కన పొదల్లో యువకుడి కదలికలు గమనించి.. మిర్జాపల్లి రైల్వేస్టేషన్ మాస్టార్‌కు సమాచారం అందించారు.
దీంతో ఆయన 108 అంబులెన్సకు సమాచారం అందించగా, వాహనం అక్కడి వరకు వెళ్లే పరిస్థితి లేదు. ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ లో వడియారం వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
SOURCE:
click here
please wait...Translate to English12 hours of hell..
A guy who fell off from the Inter City train
Chinnashankarampet: A guy who fell from the Inter City train on Monday night from Vidyan junction, experienced hell for 12 hours. This incident took place in the forest area between Mirzapalli-Vadiaram railway stations in Medak district. Upon reaching Malkajgiri, Shiva Kumar headed to work at a bank in Udayam, Nizamabad, on Monday morning. As he couldn't get work at the bank, in the evening on Monday, he boarded the Inter City Express to return to Malkajgiri. After crossing the railway gate at Kamaram station in the middle of Mirzapalli-Vadiaram railway station at night, he fell off the train. As he was desperately trying to save himself when someone tried to push him, he fell. The next morning, he noticed the railway lineman signaling for water on the tracks. The guy's screams for help on the other side of the railway track caught the attention of Mirzapalli railway station master.
Thus they informed 108 ambulance. When the vehicle reached there, the situation was under control. He was taken off the Vijayawada passenger train at 10:30 a.m. and brought to Gandhi Hospital from there.